ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కారు నడిపారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బెంజ్ కారును డ్రైవింగ్ చేస్తూ పంట పొలాలను పరిశీలించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, చేవెళ్ల యువనేత పట్లోల్ల కార్తీక్ రెడ్డి.. కేసీఆర్ పక్కన ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు డ్రైవింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తిరిగి యాక్టివ్ అవుతున్నట్లు. శనివారం గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలు, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించారు. త్వరలో జిల్లాల యాత్రలు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎర్రవల్లి ఫాం హౌస్లో కారు నడుపుతూ కేసీఆర్ కనిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, చేవెళ్ల యువనేత పట్ల కార్తీక్ రెడ్డి పక్కన కూర్చో బెట్టుకొని కారు నడిపారు కేసీఆర్.
ఫామ్లో సాగవుతున్న పంట పొలాలను పరిశీలించి, వాటి గురించి కార్తీక్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నడిపిన కారు 'మెర్సిడెస్ బెంజ్'. వైట్ కలర్లో కారులో నిర్మించబడింది. ఈ ఏడాది జులైలో కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనతో నాడు ఆయన తన ఫాం హౌస్లో వ్యాన్ నడిపారు. ఒంటరిగా కాసేపు వ్యాన్లో కలియతిరిగారు. గత ఏడాడి డిసెంబర్ 8న అర్ధరాత్రి ఇంట్లో కాలు జారిపడడంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రిలో డాక్టర్ల చికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్.. ఎర్రలి ఫాం హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.