8
ఆంధ్రప్రదేశ్
బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతంలో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర పట్టుకున్నారు. లోతట్టు ప్రదేశాలలో కనిపించేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.