Home తెలంగాణ బీసీ సంక్షేమంలో సం”క్షోభ”పర్వం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

బీసీ సంక్షేమంలో సం”క్షోభ”పర్వం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
బీసీ సంక్షేమంలో సం"క్షోభ"పర్వం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సీఎం ఆదేశాలు బేఖాతర్
  • ఇష్టరాజ్యంగా పరిపాలన
  • పెత్తనం చెలాయిస్తున్న ఆ ఐదుగురు
  • ఉద్యోగుల లబోదిబో
  • హాస్టళ్ల పర్యవేక్షణ గాలికి
  • ఫుడ్ పాయిజన్ కేసులు పట్టవేలా?

ముద్ర, తెలంగాణ బ్యూరో : లక్ష్యం మహోన్నతం.. అమలు అంద పాతాళం అన్నట్టుంది బీసీ హాస్టళ్ల దుస్థితి. ప్రభుత్వాలు మారుతున్న పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నిర్లక్ష్యం, శాఖ పరువును గంగలో కలుపుతుంది. పరిపాలన వైఫల్యం శాఖ లక్ష్యాలను నిండా ముంచుతుంది. విద్యార్థులకు రోజు సన్న బియ్యం, వారంలో నాలుగు రోజుల గుడ్లు, చికెన్, ఓ రోజు మటన్, నిత్యం పాలు, రాగి జావ, ఆహారం నిర్లక్ష్యం, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. డైట్, కాస్మోటిక్ చార్జీలు భారీగా పెంచినా, రాష్ట్ర అధికారుల ఒంటెద్దు పోకడలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హాస్టళ్ల సరిదిద్దు బాట పట్టినా, అధికారులు నిర్లక్ష్య బాట మాత్రం వీడటం లేదు. దీనితో ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలు, రాష్ట్రంలో పునరావృతం అవుతున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన కొందరి సిబ్బంది ఆగడాలతో, ప్రభుత్వానికి వైఫల్యాల మరకలు అంటుకుంటున్నాయి. విపక్షాల విమర్శలతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి.

రాష్ట్రంలో తీరిది..!

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 485 స్కూల్, 250 కాలేజీ హాస్టల్స్ ఉన్నాయి. ఇవి వార్డెన్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజన, కొత్త జోన్ల ఖరారు, 317జీవో అమలు తర్వాత ఆయా హాస్టళ్లకు చిక్కులు వచ్చాయి. వార్డెన్ల బదిలీలతో ఖాళీలు ఏర్పడ్డాయి. నిర్వహణ, నిర్వహణ కొరత లేదు. సకాలంలో కొత్త నియామకాలు చేపట్టడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్ శాఖలను మెర్జ్ చేసి, పోస్టులను మెర్జ్ చేయకపోవడం శాపంలా మారింది. కొత్త జిల్లాలకు పోస్టుల కేటాయింపుల్లో ఓ శాస్త్రీయ పద్ధతి పాటించకుండా, ఇష్టరాజ్యంగా కేటాయింపులు చేయడం సమస్యలు. వాస్తవానికి కొత్త సాంక్షన్ పోస్టులు చేసి, పదోన్నతులు కల్పించి, ఖాళీలను గుర్తించి, కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేయాలి. అలా చేయకుండా ఉన్న ఉద్యోగులనే, సర్దుబాటు చేయడంతో సమస్యలు రెట్టింపు అయ్యాయి. దీంతో హాస్టళ్ల పై పర్యవేక్షణ కొరవడింది. పూర్తి స్థాయి పర్యవేక్షణ, నిర్వహణ లేక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయి. ఆహారం అందజేతలో నాణ్యత లోపిస్తుంది. ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలు జరిగి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.

అధికారుల ఇష్టరాజ్యం..!

హాస్టళ్లలో సమస్యలు వెక్కిరిస్తున్నా, మొద్దు నిద్ర వీడటం లేదు. అయిన వాళ్ళకు ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నట్టు విధుల కేటాయింపులు చేస్తున్నారు. స్వలాభాపేక్ష కాంక్షతో పదోన్నతులు, బదిలీలు, డిప్యూటేషన్లు చేస్తున్నారు. తనిఖీల్లో సైతం స్వార్థ బుద్ధి చూపిస్తున్నారు. లంచాలు ముట్టజెప్పే వార్డెన్ల, ఏబీసీడీవో, డీబీసీడీవో పరిపాలన అధికారుల జోలికి వెళ్లకుండా, నిజాయితీగా పని చేస్తున్న వార్డెన్లు, సహాయ సంక్షేమ, జిల్లా సంక్షేమ శాఖాధికారులపై ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో వార్డెన్లు, సంక్షేమాధికారులు నలిగిపోయి, ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రాష్ట్రస్థాయి, డైట్ కాంట్రాక్టర్ల తో కుమ్మక్కయి పరిస్థితి మరింతగా దిగజారుస్తున్నారు. అందదండలున్నా కాంట్రాక్టర్ల జోలికి, జిల్లా అధికారులు వెళ్ళలేని దయనీయ స్థితి నెలకొంటుంది. ఫలితంగా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. హాస్టళ్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి హాస్టళ్లకు పెద్ద పీట వేస్తున్నా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారుల దుర్మార్గపు బుద్దులతో, హాస్టళ్ల సరిదిద్దుబాటు చర్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది.

అక్రమాలకు తార్కాణాలివి..!

01. మల్టిజోన్ వన్ లో ఐదుగురు డీబీసీడీవోలను బదిలీ చేసి, తిరిగి నలుగురిని రాష్ట్రంలోనే కొనసాగిస్తున్నారు. ఒక్కరికి మాత్రమే బదిలీ చేయడం అమలు చేయడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఈ నలుగురు గత ఇరవై ఏళ్లుగా రాష్ట్రానికి తిష్ట వేస్తున్నారు.

02. రాష్ట్ర పరీక్ష తిష్ట వేసిన నలుగురు డీబీసీడబ్ల్యూలకు ఓ ఉన్నతాధికారి అండ పుష్కలంగా ఉంది. ఆ ఉన్నతాధికారి సైతం 10 ఏళ్లుగా రాష్ట్ర గతనే పాగా వేసి, అందరిపై పెత్తనం చెలాయిస్తుండటం విశేషం.

03. సదరు ఉన్నతాధికారి, నలుగురు డీబీసీడబ్లువో కొఠారి కలిసి రాష్ట్ర కార్యాలయాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. వీరు చేసిందే చట్టం అన్నట్టు నచ్చిన వాళ్ళకు అనుకూల జీవోలు తీయడం, నచ్చని వాళ్ళను మెమోలిచ్చి బెదిరించడం పరిపాటిగా మారింది.

04. డబ్బులిచ్చిన వారికి వందల కిటకిటలాలు కూడా ఉన్న కార్యాలయాలకు ఆడిషనల్ ఛార్జ్ ల పేరుతో బాధ్యతలు ఇవ్వడం వీరికే చెల్లింది.

05. బదిలీలు, ప్రమోషన్లు, డిప్యూటేషన్లలో సైతం సమన్యాయం పాటించకుండా, సవతి తల్లి ప్రేమ చూపించడం విమర్శలకు తావిస్తోంది.

06. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన కొందరు వార్డెన్లను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు డిప్యూటేషన్ లపై పంపించడం విశేషం.

07. ముగ్గురు వన్ వార్డెన్లకు రెండేళ్ల ప్రొబేషనరి పీరియడ్ పూర్తికాకుండానే, ఏబీసీడీఓలుగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది సీసీఎల్ ఏ నిబంధనలకు విరుద్ధం. అయినా ఇలాంటి ప్రమోషన్లు ఇవ్వడం ఈ ఐదుగురు కోటరికే సాధ్యం.

08. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 డీబీసీడీఓ, 23ఏబీసీడీఓల పోస్టులు ఖాళీగా ఉన్నా, ఇప్పటికీ భర్తీ ప్రక్రియ చేపట్టడం లేదు. ఫలితంగా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech