Home తెలంగాణ బీఆర్ఎస్ ఘర్ వాపసీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

బీఆర్ఎస్ ఘర్ వాపసీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
బీఆర్ఎస్ ఘర్ వాపసీ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 25 రోజులకే పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే
  • మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సిద్ధం
  • భద్రాచలం, జగిత్యాల, షాద్‌నగర్ ఎమ్మెల్యేలూ రెడీ!
  • అనర్హత వేటు పడుతుందనే భయం
  • ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టిన బీఆర్ఎస్
  • ఉప ఎన్నిక తప్పదనే వార్నింగ్
  • భయంతో సొంతగూటికి చేరుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఘర్ వాపసీపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. జారిపోయిన ఎమ్మెల్యేలను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు తగు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగా పార్టీని వీడి కాంగ్రెస్ చేసిన ఎమ్మెల్యేలతో మళ్లీ సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా తిరిగి బీఆర్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఉంది. పైగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా అనేక వేదికలపై చెబుతోంది. దీంతో కోర్టు నుంచి ఏ క్షణమైనా అనర్హత పిటిషన్ పై తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా పునరాలోచనలోపడ్డారు.

గెలుపు అంత సులభం కాదు..

అనర్హత పిటిషన్ పై కోర్టు ఆదేశాలు జారీ అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంత సులువు కాదన్న భయంతోనే వారంతా పీఛే ముడ్ ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో భాగంగానే సొంత గూటివైపు అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వారిలో ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్‌ను ఆయన గురించిన సమాచారం. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కేటీఆర్ ను కలవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరితోపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తదనంతరం మరికొందరు కూడా తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్థానికంగా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని ఎమ్మెల్యేలు అనుకూలంగా ప్రచారం.

పార్టీలో చేరినప్పుడు ఉన్న గౌరవం ఇప్పుడు లేదా..?

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన వారిలో చాల మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని. ముఖ్యంగా కాంగ్రెస్ లో చేరే వరకు ఇచ్చిన గౌరవం, కండువా కప్పుకున్న తర్వాత వారికి దక్కడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్‌ఎస్‌ఎల్‌పీ సీఎల్‌పీలో విలీనమవుతుందని నమ్మబలికితేనే వారంతా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు వీడకపోవడం, అసెంబ్లీలో ఏదో ఒక మూలన కూర్చోవాలని సీఎం చెప్పడంతో దానిని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అవమానంగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రజాభవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌లో బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిల్చోబెట్టారు. ఈ ఘటనతో ఆయన నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ను వీడి తిరిగి బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని.

హస్తంలో ఇమడలేకపోతున్నారా?

పార్చీ మారిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో వారంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారని. ఈ పరిమాణాలు సదరు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారుతోంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల చేరికను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సరిత తీవ్రంగా వ్యతిరేకించారు. తన అనుచరులతో కలిసి గాంధీ భవన్ లో ధర్నా కూడా చేశారు. అయితే సీఎం రేవంత్ చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత సరిత కూడా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అఫిడవిట్ తప్పులను జత చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పార్టీ మారిన తర్వాత పిటిషన్ వెనక్కి తగ్గిందని చెప్పడానికి ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ మారిన తర్వాత తమను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేయడం లేదన్న ఆవేదనతో ఉన్నారు. ఇలా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఉండటంతో వారంతా త్వరలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటారన్న ప్రచారం వినిపిస్తోంది.

పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం

కొద్ది రోజులుగా ఒకరి వెంట ఒకరు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బాటపట్టడంతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు గురైంది. దీనికితోడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఫలితాల్లోనూ ఒక్క సీటు కూడా రాణ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో రాశ్యం నెలకొని ఉంది. నేపథ్యంలోనే బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఘర్ వాపసీకి తెరలేపి పార్టీలో మళ్లీ ఒక కొత్త స్థైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నాయకులు గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ వచ్చే నెల 1వ తేదీకి ఉన్నది.

ఈ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. దానం బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ పార్లమెంట్ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ టికెట్ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ప్రకటించిన తర్వాత తిరస్కరించారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్ పైనే కడియం కావ్య వరంగల్ ఎంపీగా గెలిచారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్నిరోజులపాటు అలక పట్టడంతో ఢిల్లీ పెద్దలు బుజ్జగించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. నిన్న, మొన్నటి వరకు బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ధీమాగా చెప్పింది. కానీ అటువంటి పరిస్థితులు కనిపించాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దీనితో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తి కలిగించడం ఖాయమని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech