నందమూరి నటసింహం,సంక్రాంతి హీరో యువరత్న బాలకృష్ణ(బాలకృష్ణ)మరోసారి ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'(డాకు మహారాజ్)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.వరల్డ్ వైడ్ గా జనవరి 12 న థియేటర్లలో అడుగుపెట్టనున్నఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఆల్రెడీ రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమా హిట్ అనే పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా అందరిలో ఏర్పడ్డాయి.ఇక మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి అవ్వగా ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
'దబిడి దబిడి' అనే లిరిక్స్ తో కూడిన ఈ సాంగ్ పూర్తిగా మాస్ బీట్ తో సాగింది.'బాలకృష్ణ' తో వాల్తేరు వీరయ్య ఫేమ్ 'ఊర్వశి రౌతేల' ఈ ప్రత్యేక గీతంలో డాన్స్ చేసింది.ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా, ఆ ఇద్దరు వెయ్యబోయే చిందులకి, రేపు థియేటర్స్ లో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులు డాన్స్ చెయ్యడం పక్కా.ఆ సూచన సాంగ్ ప్రోమో చెప్పకనే ఉంది.'నా ముద్దుల గోపాల గోపాల కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా',నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్స్ నే, 'నీ చేయి ఎత్తు, సింహమంటి సేటు పదాలు బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.బాలయ్య స్టెప్ ల్లో కూడా సరికొత్త గ్రేస్ కనపడుతుంది.ఇక రిలీజైన నిమిషంలోనే సోషల్ మీడియాలో ఈ సాంగ్ రికార్డుల వేట కొనసాగుతోంది.
'అల వైకుంఠ పురం'మూవీలోని 'రాములో రాములో' పాట రాసిన కాకర్ల శ్యామ్ ఈ సాంగ్ ని రచించగా ప్రతి పదం లోను బాలయ్య ఇమేజ్ ని స్థాపించడం జరిగింది.ఈ గీతాన్ని వాగ్దేవి ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియో గ్రఫీ అందించాడు.సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ మూవీస్ సంయుక్తంగా 'డాకు' మహారాజ్' కి బాబీ(bobby)దర్శకుడు. జనవరి 4 న డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.థమన్ అందించిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ద సంగీత శ్రీనాధ్ హీరోయిన్లుగా చేసారు.