సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిగా పేరుగాంచిన శ్రీ రెడ్డి బహిరంగ లేఖలు రాశారు. ఇందులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్యకు ఒకటి, మంత్రి నారా లోకేష్ కు మరో లేకను ఆమె రాశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతికి రాసిన లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీవీల్లో తప్పితే స్వయంగా చూసే అవకాశం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షిలో పనిచేసినప్పటినుంచి జగన్మోహన్ రెడ్డిపై అభిమానాన్ని పెంచుకున్నారని, తన అభిమానం పరిధి దాటి తాను వినియోగించుకున్న భాష వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కష్టాలను చూసి ఉడతా భక్తిగా తనకు సాయం చేయాలని భావించానని, అయితే ఫాల్తు లాంగ్వేజ్ తో పార్టీకి ఇబ్బందులు తెచ్చానంటూ ఆ లేఖలో వాపోయారు. తన చర్యల వల్ల ఎంత బాధపడ్డారో తాను అర్థం చేసుకోగలనని శ్రీరెడ్డి.. ఇకపై పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించారు. తన వల్ల ఇక పార్టీకి చెడ్డపేరు రాదంటూ స్పష్టం చేశారు. అలాగే మరో లేఖలో మంత్రి లోకేష్ కు ఆమె వినతిని తెలియజేశారు. లోకేష్ అన్న తనను క్షమించాలంటూ ఆమె వేడుకున్నారు. గడిచిన ఎన్నికల్లో తమ తల్లిదండ్రులు కూడా టిడిపికే ఓట్లు వేశారంటూ చెప్పారు.
లోకేష్ అన్న ఎంత మొండిగా ఉంటారో అంత మంచితనం కూడా ఉందని, తన కేసులు గురించి మాట్లాడామని ఈ సందర్భంగా ఆమె ప్రాధేయపడ్డారు. తమ కుటుంబ సభ్యులు ఒత్తిడితోనే గతంలో వీడియోలో సారీ చెప్పానని, నేరుగా కలిసే ప్రయత్నం చేసినప్పటికీ తనకు అంత అవకాశం లేదని వాపోయారు. అందుకే ఈ లెటర్ రాస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇష్టానుసారంగా మాట్లాడానని తనను క్షమించాలని నిర్ణయించుకున్నాను. పది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు, ఆ కథనాలు కింద పెడుతున్న కామెంట్లు చూసిన తర్వాత తనకు అర్థమైందని, తాను ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసినట్లు అవగాహన వచ్చిందని. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, హోం మంత్రి అనిత గారికి, మీడియా ఛానల్స్ కు ఈ సందర్భంగా ఆమె క్షమాపణలు చెప్పారు. జనసేన నాయకులకు, వీర మహిళలకు, మీడియా ఛానల్స్ కు ఈ సందర్భంగా మరోసారి ఆమె క్షమాపణలు చెప్పుకున్నారు. ఇప్పటికే తన కుటుంబం, తాను ఎంతో క్షోభను అనుభవిస్తున్నామని, ఇంట్లో పెళ్లి కావాల్సిన ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న నా జీవితాన్ని కాపాడాలి అంటూ ఆమె వేడుకున్నారు. మీడియా, సోషల్ మీడియా, కేసుల నుంచి బంధ విముక్తులను చేయాలని వేడుకున్నారు. చిరంజీవి, నాగబాబు ఈ సందర్భంగా శ్రీ రెడ్డి క్షమాపణలు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ లేఖలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. డ్రామా ఎవరిది అంటూ ప్రశ్న
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి