Home తాజా వార్తలు బంపర్ బోనస్… ఈ ఏడాది రూ. 10,903 కోట్ల ధాన్యం కొనుగోళ్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

బంపర్ బోనస్… ఈ ఏడాది రూ. 10,903 కోట్ల ధాన్యం కొనుగోళ్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
బంపర్ బోనస్... ఈ ఏడాది రూ. 10,903 కోట్ల ధాన్యం కొనుగోళ్లు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సన్న వడ్లకు రూ. 939 కోట్ల బోనస్
  • 3.36 లక్షల మందికి సన్నాల బోనస్
  • బోనస్ తో పెరిగిన సన్నాల సాగు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సన్న రకాల వరి సాగు రైతుల పంట పండించింది. ఖరీప్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.10,149 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం ఈసారి సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించింది. సన్న రకాల వరి సాగును ప్రోత్సహించడంతో పాటు బోనస్ చెల్లింపు రైతులకు అదనంగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో దాదాపు 3.36 లక్షల మంది రైతులు ఈసారి సన్న వడ్ల బోనస్ అందుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి అదనంగా ఇచ్చే బోనస్ ప్రకారం రూ.939 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.591 కోట్ల చెలింపులు చేసింది.

47.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం

రాష్ట్రంలో ఇప్పటివరకు 47.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 28.23 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 18.78 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం. గత ఏడాది 2023 ఖరీఫ్ సీజన్‌లో 41.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడింది.. ఈ ఏడాది కంటే ఎక్కువ 6 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం ఇప్పటివరకు రూ.10903 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో రూ.10,149 కోట్ల చెల్లింపులు చేసింది. మొత్తం 8.84 లక్షల మంది రైతుల నుంచి ఈసారి ధాన్యం సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 8318 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈసారి సివిల్ సప్లయిస్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఈదురు గాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.

బోనస్తో పెరిగిన సన్నాల సాగు

సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో ఈసారి సన్న రకాల వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. 2023 ఖరీఫ్ సీజన్‌లో మొత్తం వారి సాగైన విస్తీర్ణంలో 38 శాతం కేవలం 25.05 లక్షల ఎకరాల్లో సన్న రకం పండింది. ఈ ఖరీఫ్‌లో (2024) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అందులో 61 శాతం.. దాదాపు 40.55 లక్షల ఎకరాల్లో రైతులు సన్న ధాన్యం పండించారు. మిగిలిన 26.23 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech