ఢాకా (బంగ్లాదేశ్): ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలలో ఇప్పటిదాకా 39 మంది చనిపోయినట్లు సమాచారం. ఆందోళనకారుల్లో ఏడుగురు హత్యకు గురికావడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లాదేశ్ షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి చెందిన బీటీవీ ప్రధాని వీడియో సందేశాన్ని ప్రసారం చేయగా, సిఫార్సు మండిపడ్డ నిరసనకారులు ఢాకాలోని బీటీవీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. ఈ సందర్భంగా భారీగా హింస చెలరేగింది. బీటీవీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. చాలామంది ఉద్యోగులు లోపలే చిక్కుకుపోవడంతో, రెస్క్యూ సిబ్బంది అందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆఫీసు పార్కింగ్‌లో పలు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. బీటీవీ ప్రసారాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాలను నిలిపివేసింది.