Home తెలంగాణ ఫార్మా సిటీ భూములు రైతులకు ఇస్తారా? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఫార్మా సిటీ భూములు రైతులకు ఇస్తారా? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఫార్మా సిటీ భూములు రైతులకు ఇస్తారా? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రూ.16వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం
  • మరి రూ.లక్ష 50 వేల కోట్లు ఎందుకు?
  • హైదరాబాద్ లో ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ ల పనులు కొనసాగించాలి
  • అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరిన కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. ఫార్మా సిటీ కోసం ముచ్చర్ల పలు సహా గ్రామాల్లో దాదాపు 12 వేల ఎకరాల భూమి సేకరించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుత ప్రాజెక్ట్ ను రద్దు చేసినట్లు పలుమార్లు ప్రకటించిందని గుర్తు చేశారు. మరి ప్రాజెక్ట్ ను రద్దు చేస్తే రైతులకు వారి భూములను ఎప్పుడు తిరిగి ఇస్తారో చెప్పాలన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డితో సహా అందరూ ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇస్తామని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక వేళ ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతులకు భూములు ఎప్పుడు తిరిగి ఇస్తారో అని శాసనసభలో పద్దులపై జరిగిన చర్చలో కేటీఆర్ ప్రశ్నించారు.

సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులు మేమే చేశాం..

అదే విధంగా మూసీ బ్యూటిఫికేషన్ కు సంబంధించి ఖర్చు భారీగా పెంచేయటంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ బ్యూటిఫికేషన్‌లో సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వందశాతం తమ ప్రభుత్వం పూర్తి చేసింది. మూసీ బ్యూటిఫికేషన్ కు రూ.16 వేల కోట్లతో మా ప్రభుత్వమే డిజైన్ లు కూడా పూర్తి చేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఒక్కసారి రూ.50 వేల కోట్లు అంటోందట. పర్యాటక శాఖ మంత్రి రూ.75 వేల కోట్లు అంటారు. ఇటీవల గోపన్ పల్లిలో ముఖ్యమంత్రి ఏకంగా లక్షా 50 వేల కోట్ల రూపాయలు అన్నారని గుర్తు చేశారు. అసలు 16 వేల కోట్లతో ఈస్ట్, వెస్ట్ ఎక్స్ ప్రెస్ హైవేతో పాటు మూసీ బ్యూటీఫికేషన్ పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని సిద్ధం చేసింది.

మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖర్చు రూ. లక్షా 50 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని. దీనికి సంబంధించి భట్టి తమ వద్ద డీపీఆర్ కూడా ఉందని చెప్పారని…అయితే ఆ డీపీఆర్ ను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ లో ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్‌లలో భాగంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిది నెలలుగా ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల నిర్మాణం ఆపేశాయి. బిల్లులు చెల్లించకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేశారు కేటీఆర్ ప్రభుత్వాన్ని అందించారు. ఎలివేట్ కారిడర్లు కూడా పూర్తి ఘనంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, కానీ హెచ్‌ఎమ్ డీఏకు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.700 మాత్రమే కేటాయించబడింది. రూ.5 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలని శాసన సభలో మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech