ముద్ర న్యూస్, గరిడేపల్లి:గరిడేపల్లిలో ఒకే రోజు రాత్రి మూడు ఇళ్లల్లో చోరీ రామచంద్రరావు, ఖాజా మొయినుద్దీన్, గట్టికుప్పల సత్యనారాయణ రెడ్డి ఇండ్లలో చోరీ జరిగింది. చోరీ జరిగిన అన్ని తాళాలు వేసి ఉన్నాయి
తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో మాత్రమే ప్రొఫెషనల్ దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీకి పాల్పడిన దొంగలు ఇండ్లకు వేసి ఉన్న తాళాలను పగల కొట్టి లోనికి ప్రవేశించి పక్క దొంగ ఇండ్ల వారి డోర్లకు కూడా బయట పెట్టి గడియ పెట్టి తన కోసం అరెస్ట్ చేసారు. ఈ ముగ్గురి ఇళ్లల్లో ఇనుప బీరువాలను నకిలీ తాళం చెవులు పెట్టి వాటిలోని వస్తువులన్నింటిని చిందర వందర చేసి నగదు బంగారాన్ని దోచుకెళ్లారు.
రామచంద్రరావు ఇంట్లో సుమారు రెండు లక్షలకు పైగా నగదు ఒక వెండి మొలతాడు ఖాజా మోహినిద్దీన్ ఇంటిలో సుమారు ఐదు తులాల బంగారం గట్టికొప్పుల సత్యనారాయణ రెడ్డి ఇంటిలో సుమారు 4000 రూపాయల నగదును దొంగిలించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ దొంగలు మండల కేంద్రమైన గరిడేపల్లిలో రెక్కీ నిర్వహించినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.దొంగలు ఇళ్లకు తాళాలు వేసి ఉన్న వాటిని గమనించి ఆ ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. అతి చాకచక్యంగా తాళాలను తొలగించి ఇనుప బీరువాల డోర్లను తీసి దొంగతనానికి విశేషం
పోలీసులు పెట్రోలింగ్ చేసిన వెంటనే వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. గురువారం ఉదయం జరిగిన దొంగతనాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలను సేకరించారు. సమీప ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరు తిరిగినట్లు స్పష్టమైన సమాచారంతో దొంగతనాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా గరిడేపల్లిలో నిపుణలు వచ్చి స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.