- బిఆర్ఎస్ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి
- సుంకిశాల కూలడం తో వందల కోట్ల నష్టం
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల డిజైన్లు అంతా లోప బుయ్యిగా చేపట్టారని, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు.
శుక్రవారం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ అవసరాల కోసం నల్లగొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మాణం సుంకిశాల సంఘటన పథకానికి సంబంధించిన వాల్ కూలడం బీఆర్ఎస్ హయంలో చేపట్టిన నాసిరకం పనులే కారణమని తేలింది. వారి హాయంలో కట్టిందే కూలిందని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు బధ్నం చేయాలని చూస్తున్నారని. సుంకిశాల వాల్ కూలిపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఉన్నట్టు లేదు. గత పదేళ్ల కాలంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో ఎవరేం చేశారో ప్రజలు గమనిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంరాజ్యంగా డిజైన్లు, నాసిరకం పనుల వల్ల ప్రాజెక్టులు పనికి రాకుండా తయారయ్యాయి. వేలాది కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయి, ప్రాజెక్టులు, పథకాలు 10 కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించలేదని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఇన్నాళ్లు కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అనుకున్నామని, గత బీఆర్ఎస్ పాలకులు కట్టినవన్నీ అద్వానమేనని ప్రస్తుతం తెలుస్తున్నదని తెలిపారు.
వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టును పనికిరాకుండా చేశామని, నాసిరకం పనుల వల్లే రైతులకు ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు.
సీఎం విదేశీ పర్యటనలో భాగంగా వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు ఇస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే దీటైన నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి కోసం వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.