శనివారం రోజున రాజమహేంద్రవరంలో గేమ్ చెంజర్(గేమ్ ఛేంజర్)ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతేంటని. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్రాజు(దిల్ రాజు)మీడియా సమక్షంలో వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది.
ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమ’ ఇలా ఇద్దరూ అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో 5ల క్షల ఆర్థిక సాయాన్ని అందించాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.