- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ కు చెందిన మట్టిపల్లి భాగ్యలక్ష్మి కి చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే మీదుగా అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్,పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి,కొండమడుగు ఎల్లస్వామి,నార్లకంటి రామ్ రెడ్డి,ఇట్టమోని మహేష్,సప్పిడి చంద్ర శేఖర్ రెడ్డి,ఇట్టమోని నరేందర్,బండారు శేఖర్ రెడ్డి,గోదాసు శ్రీశైలం, సిద్దగోని మహేష్, బండారు బాల్ రెడ్డి,శ్రీశైలం ,బద్దం రాజు,ఒంట్టేడు ఎల్లయ్య,నాగెల్లి శేఖర్ కొనసాగుతున్నాడు.