29
- మలేషియా తెలంగాణ అసోసియేషన్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వాసులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారిని ఆదుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. ఈ మేరకు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (ఎంవైటీఏ) దశాబ్ధి ఉత్సవాల్లో టీపీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నా సరే వారి కష్టసుఖాల్లో తాము పాలు పంచుకుంటామని చెప్పారు. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలకు తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో మలేషియాకు వచ్చామన్నారు. వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల భవిష్యత్ లో అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.