- హైదరాబాద్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీతో విచారణ
- ప్రభాకర్ రావు, శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీస్ పై ఇంటర్ పోల్ కి లేఖ రాశాం
- జైనూర్ ఘటనలో 38 మందిని అరెస్ట్ చేశాం
- గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి చేశాం
- శబ్ధ కాలుష్యం నగరవాసులను ఇబ్బంది పెట్టింది
- డీజేల విషయంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తాం
- డీజీపీ జితేందర్ రెడ్డి ప్రెస్ మీట్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందని డీజీపీ జితేందర్ చెప్పారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, పశ్చిమ మండల డీసీపీ విచారణ అన్నారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ హైదరాబాద్ మీడియాతో డీజీపీ జితేందర్ మాట్లాడారు.. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్టేట్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు , ఛానల్ ఎండీ శ్రవణ్ రావులను విదేశాల నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీరిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ ప్రస్తుతం సీబీఐ వద్ద ప్రాసెసింగ్‌లో ప్రదర్శన. రెడ్ కార్నర్ నోటీస్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్ అని, ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నిందితులకు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ కోసం ఇంకొంత సమయం పడుతోందని తెలిపారు.
తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు
తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదని డీజీపీ జితేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని, అయితే మన రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటన దురదుష్టకరం అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ కేసులో 38 మందిని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ పరిస్థితులు చేయి దాటి పోవడంతో పలువురిని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ అలసత్వం వహించిన డీఎస్పీ పై వేటు వేశామని డీజీపీ ప్రకటించారు.
డీజేలకు సంబంధించి త్వరలో గైడ్ లైన్స్
ఊరేగింపులు, శోభయాత్రలకు డీజేలు పెట్టడం వల్ల శబ్ధ కాలుష్యం పెరిగి హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభీ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా పోలీస్ శాఖ చాలాబాగా కృషి చేసిందని పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. బందోబస్తులో 15,400 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 12 వేల మంది ట్రైనీ ఎస్ఐ, కానిస్టేబుళ్ళను సైతం బందోబస్తు విధుల్లో వినియోగించామని చెప్పారు. 5,879 నిజనం పాయింట్లు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూంలు, డీజీపీ కార్యాలయం నుంచి మానిటర్ చేశామన్నారు.