24
ముద్ర,సెంట్రల్ డెస్క్:-అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్‌కు బెంగళూరులోని లేడీ కర్జన్ ఆసుపత్రిలో శుక్రవారం వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన కర్ణాటకలోని హస్సన్ పార్లమెంటు సభ్యుడు. కొద్దిసేపట్లో ప్రత్యేక ఆయనను సిట్ కోర్టులో హాజరుపర్చనుంది. అనంతరం ప్రజ్వల్ రేవణ్ణను కస్టాడీకి అప్పగించాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయాలని కోరింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. భవానీ రేవణ్ణను రేపు ఆమె ఇంట్లోనే సిట్ ప్రశ్నించనున్నది. ప్రజ్వల్ రేవణ్ణను తరలించే వాహనంలో లేడీ ఎస్కార్ట్స్ ను ఏర్పాటు చేశారు. మహిళా భద్రతకు ఢోకా లేదని చెప్పడానికే ప్రజ్వల చుట్టూ మహిళా అధికారులను పెట్టామని సిట్‌ని ప్రకటించింది.