ముద్ర.వీపనగండ్ల:- గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వీపనగండ్ల గ్రామానికి ఆదర్శంగా వచ్చిన వనపర్తి జిల్లా కలెక్టర్ సురభి వినతి పత్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో సీపీఎం మండల నాయకులు ఆశన్న,ఈశ్వర్ మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, స్ట్రీట్‌లైట్లు వెలగడం లేదని, ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థుల ఆందోళనలో ఉన్నందున వెంటనే టీచర్లను నియమించాలని సూచించారు.
ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన డాక్టర్లు,సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డాక్టర్లను నియమించాలని వినతిపత్రంలో ఉన్నారు. గోపాల్ దీన్నే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, రుణమాఫీ లిస్టు ఇవ్వాలని, వానకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు కొత్త రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు, కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు శ్రీనివాసులు, రాముడు,ప్రజలు ఉన్నారు.