- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
- డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సాయిదులు*
తుంగతుర్తి ముద్రణ: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతుల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండలంలో డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సాయిదులు అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశానుసారం మండల పరిధిలోని వెలుగుపల్లి, దేవుని గుట్ట తండా, వెంపటి, గొట్టిపర్తి, తుంగతుర్తి, కొత్తగూడెం, గానుగుబండ, గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ధరతో పాటు సన్నాలకు 500 బోనస్ అందిస్తూ రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కొనుగోలు కేంద్రాలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమాన్ని కొనసాగిస్తోంది. అందులో భాగంగానే రైతులకు సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కురూ. 500 రూపాయలు బోనస్ అందిస్తోంది. రైతులు ఈ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని ఆయన నిర్ణయించారు. రైతులకు ఎలాంటి సమాచారం కలగకుండా నిర్వాహకులు అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి. దయానంద్,ఎంపీడీవో శేషు కుమార్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ గోవింద్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, ఏఈఓలు జోష్న, మహితా రెడ్డి, సీసీ గడ్డం గిరి, ఇన్చార్జి సిసి నర్సింగ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు,ఆయా గ్రామాల కార్యదర్శులు , మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లత విజయ్ కుమార్ రెడ్డి, చింతకుంట్ల వెంకన్న, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సర్పంచు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సగ్గం నరసయ్య, సంఘ బంధం సభ్యులు, వీవో ఏ లు, రైతులు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.