రచయితగా తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పని చేసిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(posani krishna murali)ఆ పై నటుడుగా,నిర్మతగా, దర్శకుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2009లో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించాడు.
మొన్న మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) పై పోసాని అనుచిత వ్యాక్యలు చేసాడు.సభ్య సమాజం తలదించుకునేలా పవన్ తల్లిని,భార్యని, పిల్లల్ని పోసాని తిట్టిన తీరు అందర్నీ షాక్ కి గురి చేసింది.దీంతో అప్పట్లో జనసేన నాయకులు, పవన్ అభిమానులు చాలా ఏరియాల్లో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ అప్పటి వైసిపి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా రాజమండ్రి కి చెందిన జనసేన నాయకులు తమ నాయకుడిని తిట్టినందుకు పోసాని పై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ని స్వీకరించిన పోలీసులు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారని తెలుస్తుంది
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(చంద్రబాబు నాయుడు)ఆయన కుటంబంపై కూడా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసాడని కూడా జనసేన నాయకులు తమ కంప్లైంట్ లో పొందుపరిచారు.భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సైకోళ్ల రక్తం తాగే రాక్షసుల్లా చంద్రబాబు, పవన్,లోకేష్ లపై పోస్ట్ లు చేసిన సోషల్ మీడియా యాక్టీవిస్ట్ ల ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని అరెస్ట్ కూడా ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో సినీ కులం ఏమంటుందో చూడాలి.