- రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 సీఐపై వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదు
- డీజీపీని కలిసిన బాధిత దంపతులు
ముద్ర, తెలంగాణ బ్యూరో: కష్టపడి చదివి సీఐను చేసిన వృద్ధ తల్లిదండ్రులపై కొడుకు ఖాకీ ప్రతాపం చూపించాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టి వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. ఆలించి..లాలించి కొడుకును ఇప్పుడు సమాజంలో గౌరవంగా బతికే స్థాయికి చేర్చిన తల్లిదండ్రులు.. ఎవరికి చెప్పిన ఫలితం ఉండదని భావించిన బాధిత వృద్ధ దంపతులు మంగళవారం పోలీస్ డీజీపీని కలిసి తమ కొడుకుపై ఫిర్యాదు చేశారు. ,
వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన పెద్ద రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు. కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రఘునాధ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగిలిన భూమి కూతుళ్లకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. అయితే 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ, హింసించాడు. దీంతో తల్లిదండ్రుల దుస్థితి, సొంత అన్న ప్రవర్తనను చూసి ఓర్వలేకపోయిన చిన్న కుమారుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకుేశ్వర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి, అతనిపై చర్యలు తీసుకున్న వృద్ధ తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.