28
ముద్ర,తెలంగాణ:- మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. మొత్తం 12 మంది నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు సమాచారం. కేసు నమోదు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు.