మూవీ : పోగుమ్ ఇదమ్ వేగు తూరమిల్లై
నటీనటులు : విమల్, కరుణాస్, మేరీ రికెట్స్, ఆడుకాలమ్ నరెన్, పవన్ నిర్వహించారు.
ఎడిటింగ్: త్యాగరాజన్
సినిమాటోగ్రఫీ: డేమెల్ సేవియర్
మ్యూజిక్: ఎన్ ఆర్ రఘునందన్
నిర్మాతలు: శివ కిళారి
దర్శకత్వం: మైఖేల్ రాజా
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
కథ:
కుమార్ (విమల్) మార్చురీ వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతని భార్య మేరీకి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వలన, ఆ పరిస్థితుల్లో కూడా నారాయణ పెరుమాళ్ డెడ్ బాడీని తీసుకుని చిత్తూరులో అప్పగించడానికి కుమార్ అంగీకరిస్తాడు. నారాయణ పెరుమాళ్ పెద్ద భార్య కొడుకు నరసింహనాయుడు (ఆడుకాలం నరేన్). ఇక మునుసామి నాయుడు (పవన్) తాను కూడా నారాయణ పెరుమాళ్ వారసుడి అని చెప్పుకుని తిరుగుతుంటాడు. తన తల్లికి నారాయణ పెరుమాళ్ తాళి కట్టలేదనే ఒక అసంతృప్తి మునుసామి నాయుడిలో ఉంటుంది. అందువలన ఆయన అంత్యక్రియలను తాను నిర్వహించి, తాను సంతానమేననే నిరూపణ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. తాను ఉండగా మునుసామి ఎలా తండ్రికి తలకొరివి పెడతాడనే కోపంతో నరసింహనాయుడు ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే నారాయణ పెరుమాళ్ డెడ్ బాడీని తీసుకుని కుమార్ వ్యానులో బయల్దేరతాడు. కుమార్ కొంతదూరం వచ్చిన తరువాత, మూర్తి ( కరుణాస్) లిఫ్ట్ అడుగుతాడు. తాను కూడా చిత్తూరు వెళ్లాలని రిక్వెస్ట్ చేస్తుంది. తనకి వెనకా ముందు ఎవరూ లేరనీ, నాటకాలు ఆడుతూ ఉండేవాడినని మూర్తి చెబుతాడు. ఆ తర్వాత కుమార్ లైఫ్ లో ఏం జరిగింది. ఆ శవాన్ని మునుస్వామికి అప్పగించాడా లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
పోగుమ్ ఇదమ్ వేగు తూరమిల్లై అంటే పోయి చోటు చాలా దూరంలో లేదు అనేది దూరం. ఈ టైటిల్ కి తగ్గట్టుగా కథ సాగుతుంది. సరికొత్త స్టోరీ లైన్ తో ఫీల్ గుడ్ ఎమోషన్స్ ని మిక్స్ చేశారు దర్శకుడు. కథని గ్రిస్పింగ్ గా రాసుకుని ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చునేలా చేశాడు దర్శకుడు. అయితే మొదటి నలభై నిమిషాలు కథ నత్తనడకన సాగుతుంది.
ఫస్టాఫ్ వరకు స్లోగా సాగిన ప్రతీ పాత్రను కనెక్ట్ చేశాడు. సెకెంధాఫ్ లో కథలో వేగం పుంజుకుంటుంది. అయితే ఓ మార్చురీ వ్యాన్ నడిపే వ్యక్తిది జీవితమే.. అతడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఇలా ఓ ఇంటెన్స్ డ్రామాని సాగించిన దర్శకుడు. ఇద్దరికి న్యాయం చేశాడా లేదా అనే పాయింట్ ని తెరపై చక్కగా ప్రదర్శించాడు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ లేదు కానీ ఫ్యామిలీ డ్రామా పుష్కలంగా ఉంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు.
అడల్డ్ కంటెంట్ ఏం లేదు. కానీ ల్యాగ్ ఉంది. అశ్లీల పదాలు లేవు కానీ స్లోగా సాగుతుంది. ఇంతలా స్లోగా అని ఎందుకు చెప్తున్నానంటే.. ఓ ఫీల్ గుడ్ మూవీని యావరేజ్ గా మార్చేది స్లోగా సాగే కథనమే. తాజాగా వచ్చిన సత్యం సుందరం సినిమా నచ్చినవాళ్ళకి ఈ సినిమా కచ్చితంగా నచ్చేస్తుంది. డెమెల్ సేవియర్ ఫొటోగ్రఫీ .. రఘునందన్ నేపథ్య సంగీతం .. త్యాగరాజన్ ఎడిటింగ్ ఈ కథకి హెల్ప్ అయ్యాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా, ఈ కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాల జాబితాలో దీనిని కూడా చేర్చుకోవచ్చు.
నటీనటుల పనితీరు:
కుమార్ గా విమల్, నరసింహానాయుడుగా ఆడుకాలం నరేన్, మునుసామి నాయుడుగా పవన్, మూర్తిగా కరుణాస్ ఆకట్టుకున్నారు. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: ల్యాగ్ బాట్ ఇంపాక్ట్ స్టోరీ. ఫ్యామిలీతో కలిసి చూస్తే సినిమా.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్