ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఐవీఎఫ్ సెంటర్‌ను మంత్రి రాజనర్సింహా ప్రభాకర్‌గా మార్చారు. అనంతరం కొత్త భవన నిర్మాణం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ.. పేదలకు కార్పోరేట్ తరహాలో మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైద్యవృత్తి మానవత్వంతో కూడుకున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం రూ. 200 కోట్ల నిధులను కేటాయించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ళగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోనే మొట్టమొదటిసారిగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలను ఖర్చు పెట్టి ట్రీట్ మెంట్ తీసుకోలేని పేద మహిళలకు తల్లి కావాలనే ఆకాంక్ష నెరవేరుతుంది. మరో 15 రోజుల్లో హైదరాబాద్‌లోని పేట్లబూర్జు మెటర్నటీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వరంగల్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు నూతన వసతి గృహాలకు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. గోషా మహల్ లో సుమారు 32 ఎకరాల్లో 2000 కోట్ల రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మించేందుకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పారు. ఇప్పుడున్న 32 సూపర్ స్పెషాలిటీ శాఖలతో పాటు మరిన్ని సూపర్ స్పెషాలిటీలను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను రూపొందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్సీ రియాజ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితర ప్రభుత్వ అధికారులు ఉన్నారు.