22
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒరిస్సాలోని పూరి సముద్ర తీరం బీచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతిక శిల్పాన్ని ఫిషరీస్ కార్పోరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రియతమ తెలంగాణ నేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సైతిక శిల్పం ఆవిష్కరించి అభిమానాన్ని చాటుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత పదినెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజాభిమానాన్ని పొందింది. సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తామన్నారు.