Home సినిమా 'పుష్ప3 ది ర్యాంపేజ్‌'పై అప్‌డేట్‌ వచ్చేసింది… ఇక పుష్పరాజ్‌ దూకుడుకి తిరుగులేదు! – Prajapalana News

'పుష్ప3 ది ర్యాంపేజ్‌'పై అప్‌డేట్‌ వచ్చేసింది… ఇక పుష్పరాజ్‌ దూకుడుకి తిరుగులేదు! – Prajapalana News

by Prajapalana
0 comments
'పుష్ప3 ది ర్యాంపేజ్‌'పై అప్‌డేట్‌ వచ్చేసింది... ఇక పుష్పరాజ్‌ దూకుడుకి తిరుగులేదు!


మూవీ లవర్స్, బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని తరుణం వచ్చేసింది. 'పుష్ప2 ది రూల్' డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతకుముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఇప్పుడెక్కడ చూసినా పుష్ప2 గురించే చర్చ జరుగుతోంది. ఈసారి పుష్పరాజ్‌ ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతున్నాడు అనే దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు. 'పుష్ప2' రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో 'పుష్ప3 ది ర్యాంపేజ్'కి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. పుష్పకి మూడో పార్ట్‌ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. అది నిజమేనని చెప్పే ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్ర యూనిట్. 'పుష్ప 2' చిత్రం సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేసిన రసూల్‌ పూకుట్టితో కలిసి చిత్ర యూనిట్‌ దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ గ్రూప్‌ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్క్రీన్‌పై 'పుష్ప3 ది ర్యాంపేజ్' అనే టైటిల్ స్పష్టంగా కనిపించింది. ఈ ఫోటోను షేర్‌ చేసిన కొద్ది సేపటికే డిలీట్‌ చేసారు. అయితే అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఓ పక్క 'పుష్ప2' గురించి మాట్లాడుకుంటూనే మరో 'పుష్ప3'కి సంబంధించిన అప్‌డేట్‌ గురించి కూడా చర్చిస్తున్నారు. 'పుష్ప2' ఎండిరగ్‌లోనే 'పుష్ప3'కి సంబంధించిన లీడ్‌ ఇవ్వబోతున్నారని చూపిస్తున్నారు. నిజానికి పార్ట్‌ 3కి సంబంధించిన అప్‌డేట్‌ విజయ్‌ దేవరకొండ మూడేళ్ళ క్రితమే ఇచ్చేశాడు. సుకుమార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపూ అతను ట్వీట్‌లో '2021 డిజి, 2022 డి రూల్‌, 2023 డి ర్యాంపేజ్‌' అని రైడ్ చేశాడు. అయితే అతను చెప్పిన ఇయర్స్‌లో ఆ సినిమాలు రాకపోయినా పార్ట్ 3 అని మాత్రం స్పష్టమైంది. తాజాగా రసూల్‌ పూకుట్టి పోస్ట్‌తో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, ఇటీవల పుష్ప2కి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో పుష్ప3 గురించి అడిగిన ప్రశ్నకు నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్‌ స్పందిస్తూ పుష్ప2ని సూపర్‌ డూపర్‌ హిట్‌ చేస్తే తప్పకుండా పార్ట్‌ 3న తెలియజేశారు. అంతేకాదు, పార్ట్‌ 2లో పార్ట్‌3కి సంబంధించిన లీడ్‌ తప్పకుండా ఉంటుందన్నారు. 'పుష్ప' ఫ్రాంచైజీగా మార్చాలన్న ఆలోచన ఉందని, దీనికి సంబంధించి సుకుమార్‌ దగ్గర అద్భుతమైన ఐడియాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం జరిగిన2 ఈవెంట్‌లో సుకుమార్‌ పార్ట్‌ 3పై క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ మరో మూడేళ్ళు తనకు ఇస్తే పుష్ప3 తప్పకుండా చేస్తాను అన్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech