అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప2' విడుదల మళ్లీ వాయిదా వేసారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ కావాల్సింది చాలా కారణాలు, మరెన్నో అవరోధాల వల్ల రిలీజ్‌ని వాయిదా వేశారు. ఫైనల్‌గా డిసెంబర్ 5న సినిమా విడుదల రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన 'పుష్ప' ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండేళ్ళుగా ప్రేక్షకులు, అభిమానులు 'పుష్ప2' కోసం వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో సినిమా చూడొచ్చు అని ఆశపడుతున్న ప్రేక్షకులకు రిలీజ్ వాయిదా పడిందనే వార్త మింగుడు పడడం లేదు. అయితే ఈ వార్తలో నిజమెంత..?
రిలీజ్‌ని మళ్లీ ఎందుకు వాయిదా వెయ్యాల్సి వస్తోంది అనే దానిపై కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండటం వల్ల డిసెంబర్ 5 వరకు ఫస్ట్ కాపీ రెడీ అయ్యే అవకాశం లేదనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. ఇందులో నిజం ఓ పక్క షూటింగ్ చేస్తూనే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని కూడా ఫాస్ట్ ఫినిష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ యూనిట్లతో శరవేగంగా వర్క్ పూర్తి సమాచారం. నవంబర్ 28న షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉందని. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్‌గా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ కి సరిగ్గా వారం రోజుల ముందు షూటింగ్ పూర్తవుతుంది. మరి ఆ వారం రోజుల్లో ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేసినా ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందా అనే సందేహం అందరికీ వస్తుంది. కాబట్టి రిలీజ్ ని వాయిదా వెయ్యడం అనివార్యం అనే వార్త ఇప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై పుష్ప టీం స్పందించింది. ట్విట్టర్‌లో పుష్ప అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక జిఫ్ వీడియోను విడుదల చేశారు. 'డిసెంబర్ 5న విడుదల. అసలు తగ్గేదేలే' అంటూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి ఎట్టిపరిస్థితుల్లో 'పుష్ప2' డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని అర్థమవుతోంది. ప్రస్తుతం సుకుమార్ షూటింగ్‌లో ఉండగా, టెక్నికల్ టీమ్ నాన్‌స్టాప్‌గా వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. మరోపక్క ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ తన వంతు కృషి చేస్తున్నాడు. త్వరలోనే చెన్నయ్‌లో సినిమాలోని ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ ఆ పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి 'పుష్ప2' రిలీజ్ వాయిదా అనే ప్రచారానికి మేకర్స్ బ్రేక్ వేశారు. అంటే పుష్పరాజ్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయడం ఖాయమన్నమాట.