అల్లు అర్జున్, సుకుమార్‌ల 'పుష్ప2' రెండో రోజూ కలెక్షన్ల మోత మోగించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్ చేయగా, రెండో రోజు రూ.449 కోట్లతో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించి తన స్టామినా ఏమిటో మరోసారి చూపించింది. మొదటి రోజు కలెక్షన్లలో రూ.65 కోట్లతో షారూక్ ఖాన్ జవాన్ బాలీవుడ్‌లో రికార్డు సృష్టించగా దాన్ని పుష్ప2 రూ.72 కోట్లతో క్రాస్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డబ్బింగ్ సినిమా తమిళనాడులో మొదటి రోజు రూ.11 కోట్లు కలెక్ట్ చేయడం ఒక రికార్డుగానే చెప్పాలి. ఇక కేరళలో 2024 సంవత్సరానికి పుష్ప2 హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ మొదటి రోజున రూ.6.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మొదటిరోజే 8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి 2024లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప2. ఇక నైజాం ఏరియాలో ఫస్ట్ డే రూ.30 కోట్లు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసుకుంది. అలాగే కృష్ణా జిల్లాలో రూ.4.42 కోట్లు వసూలు చేసి అక్కడ కూడా ఆల్టైమ్ రికార్డు రికార్డు. దానితోపాటు ఉత్తరాంధ్రలో కూడా మొదటి రోజు రూ.7.78 కోట్లతో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. సీడెడ్‌లో మల్టీస్టారర్ చిత్రం కాకుండా సోలో హీరో నటించిన సినిమాగా ఫస్ట్ డే రూ.12.5 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది పుష్ప2.
మొదటి షో నుంచే ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదటిరోజు రూ.294 కోట్లు ఫిగర్ చూసిన తర్వాత రెండో రోజు నుంచి అంత భారీ కలెక్షన్లు ఉండవు అని అంచనా వేశారు. కానీ, దాన్ని తారుమారు చేస్తూ రెండో రోజు దాదాపు రూ.150 కోట్లు సాధించడం విశేషం. ఇంకా శనివారం, ఆదివారం మిగిలే ఉన్న నేపథ్యంలో పుష్ప2కి తిరుగులేదని రెండో రోజు కలెక్షన్స్ ప్రూవ్ అవుతున్నాయి. ఏది ఏమైనా లాంగ్ రన్‌లో కూడా ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్లు సాధించే దిశగా ప్రయాణిస్తోంది. పుష్ప2 కలెక్షన్లు ఇంకా ఏ స్థాయికి వెళతాయో, పుష్పరాజ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.