దేవరతో(దేవర)తెలుగు సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన భామ జాన్వీ కపూర్(janhvi kapoor)తొలి సినిమాతోనే తల్లి శ్రీదేవి(sridevi)కి తగ్గ వారసురాలు అనిపించిన జాన్వీ భారీగా అభిమానులను కూడా సంపాదించుకుందని చెప్పవచ్చు.ప్రస్తుతం రామ్ చరణ్(ram charan)బుచ్చిబాబు(buchibabu)కాంబోలో చూస్తున్న మూవీలో చేస్తుండగా రోజుల క్రితమే సదరు మూవీ షూటింగ్ కూడా ప్రారంభించింది.
అసలు విషయానికి వస్తే పుష్ప 2(pushpa 2)నార్త్ ఇండియాలో అత్యధిక థియేటర్స్ లో విడుదలవ్వడం వల్ల ఇంటర్ స్టెల్లార్(interstellar)అనే హాలీవుడ్ మూవీ రీ రిలీజ్ వాయిదా పడింది.నిజానికి ఈ మూవీ కోసం నార్త్ ఇండియాకి చెందిన చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తూ వస్తున్నారు.దీంతో ఆ మూవీ తాలూకు లవర్స్ నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. శాతం ఐమాక్స్ లని పుష్ప 2 కి కేటాయించి,ఇంటర్ స్టెల్లార్ కి అన్యాయం చేసారని, సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడంతో పాటుగా మిమ్స్ పేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక జాన్వీ కపూర్ ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తు 'పుష్ప 2 కూడా సినిమానే కదా.మరి ఎందుకు మరో సినిమాతో పోలుస్తూ తక్కువ అంచనా వేస్తున్నారు.మన సినిమాలను చూసి ఇప్పుడు హాలీవుడ్ సినీ పరిశ్రమ మెచ్చుకుంటుంది.కానీ మనం మాత్రం, మన చిత్రాలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం.ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా బాధగానే ఉంటుందా? కామెంట్స్ చేసింది.జాన్వీ తెలుగు సినిమాకి మద్దతుగా నిలవటం పట్ల తెలుగు సినిమా ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇక పుష్ప 2 తొలి రోజు రెండు వందల తొంబై నాలుగు కోట్ల రూపాయలని సాధించి, ఆ ఫిగర్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. రెండో రోజు కూడా అదే హవాని కొనసాగిస్తే మొత్తం రెండు రోజులకి నాలుగు వందల కోట్ల రూపాయలని సాధించి తన సత్తా చాటుతుంది.