Home సినిమా 'పుష్ప-2' ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందించడానికి అసలు కారణమిదే! – Prajapalana News

'పుష్ప-2' ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందించడానికి అసలు కారణమిదే! – Prajapalana News

by Prajapalana
0 comments
'పుష్ప-2' ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందించడానికి అసలు కారణమిదే!


ప్రస్తుతం 'పుష్ప-2' ట్రైలర్ గురించి అందరూ ఎంతలా మాట్లాడుకుంటున్నారో, ఆ ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంపై కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. తెలుగు నుంచి వస్తున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ, అందునా తమ ఫ్యామిలీలో ఒకడైన అల్లు అర్జున్ నటించిన సినిమా వస్తుంటే.. మెగా హీరోలు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనను దృష్టిలో ఉంచుకునే, మెగా ఫ్యామిలీ స్పందించడం లేదని బన్నీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి మెగా అభిమానుల స్పందన మాత్రం మరోలా ఉంది. (పుష్ప 2 ట్రైలర్)

పవన్ కళ్యాణ్ 'ఓజీ' గ్లింప్స్, చిరంజీవి 'విశ్వంభర' టీజర్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదలైనప్పుడు అల్లు అర్జున్ స్పందించలేదు. కనీసం తాను ఇన్స్పిరేషన్ గా భావించే తన మావయ్య చిరంజీవి మూవీ టీజర్ కి బన్నీ నుంచి రెస్పాన్స్ లేదు. అలాంటిది 'పుష్ప-2' ట్రైలర్ కి మాత్రం మెగా హీరోలు ఎందుకు స్పందించాలని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మీ హీరో స్పందించినప్పుడు, మీ హీరో సినిమాకి ప్రతి స్పందన ఎలా ఉంటుందో ఆశిస్తున్నారని నిలదీస్తున్నారు. లాజిక్ గా ఆలోచిస్తే మెగా అభిమానుల ప్రశ్న సరైనదే. ప్రతి టీజర్ కి, ప్రతి ట్రైలర్ కి అందరూ స్పందించాలని లేదు. బహుశా సినిమా విడుదలై పెద్ద విజయం సాధించాక మెగా ఫ్యామిలీ నుంచి విశేషాలు వస్తాయేమో. అప్పటివరకు వెయిట్ చేయకుండా.. ముందుకు ముందే మెగా హీరోలు రియాక్ట్ అవ్వలేదని అనడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech