Home సినిమా పుష్ప 2 ఎఫెక్ట్..రంగంలోకి జాతీయ మానవ హక్కుల కమీషన్ – Prajapalana News

పుష్ప 2 ఎఫెక్ట్..రంగంలోకి జాతీయ మానవ హక్కుల కమీషన్ – Prajapalana News

by Prajapalana
0 comments
పుష్ప 2 ఎఫెక్ట్..రంగంలోకి జాతీయ మానవ హక్కుల కమీషన్


అల్లు అర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పుష్ప 2(పుష్ప 2)ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేసారు.ఇక రిలీజ్ కంటే ఒక రోజు ముందు నైట్ అభిమానుల కోసం చాలా ఏరియాల్లో బెనిఫిట్ షోలు జరిగాయి. కూడా వేశారు. అందులో భాగంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో కూడా బెనిఫిట్ షో వెయ్యడం జరుగగా,ఆ షో కి అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. దీంతో తొక్కిసలాట జరిగి రేణుక అనే మహిళ మృతి చెందగా,ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు.

ఈపై సంధ్య థియేటర్(sandhya theatre)పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఒక పిటిషన్ వచ్చింది.చిక్కపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జీ చేయడం,థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల రేణుక అనే మహిళ మృతి చెందింది.ఘటనకు కారణమైన అందరిపై చర్యలు తీసుకోవాలి. సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి అనుమతి లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేసారని పిటిషనర్ కోరడం జరిగింది. కమీషన్ కూడా ఈ కేసుని విచారణకు స్వీకరించింది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech