ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)అప్ కమింగ్ మూవీ పుష్ప 2(పుష్ప 2) వచ్చే నెల డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని దర్శకుడు సుకుమార్(సుకుమార్)పార్ట్ 1 ని మించి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీలో రష్మిక(rashmika)ఫాహద్ ఫాజిల్,అనసూయ,సునీల్ ముఖ్య పాత్రల్లో నిర్మాణ దశలో కనిపించనున్నారు.ప్రముఖ హీరోయిన్ శ్రీలీల(sreeleela)స్పెషల్ సాంగ్ లో చేస్తుండగా సమంత(samantha)తో పాటు మరో హీరోయిన్ కూడా ఆ సాంగ్ లో కనిపించబోతున్నారనే టాక్ అయితే ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు.అందులో భాగంగానే ట్రైలర్ కి సంబంధించిన ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నా(పట్నా)లో జరగనుంది. నవంబర్ 17 ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి పాట్నాలోని గాంధీ మైదానంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగే ఈ ఈవెంట్ కి పాట్నా పోలీసులు కనివినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు నిర్వహించారు.ఈ మేరకు పుష్ప నిర్వాకాలతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ,తగిన సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు.ట్రైలర్ రిలీజ్ వేడుకలో అల్లుఅర్జున్ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొననుంది.