సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం తొలి పండగ ప్రారంభం సందర్భంగా ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించి తదుపరి ప్రత్యేక అలంకారాలలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేస్తారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రఘువరన్ ఆచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినం నాడు ప్రాతకాలమే తలస్నానం ఆచరించి తదుపరి ఆలయ దర్శనం చేసుకోవాలని ముఖ్యంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఆరాధించాలని సూచించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి మరియు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.