Home తెలంగాణ పసిడి పంటల తెలంగాణ… పంటల సాగులో టాప్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

పసిడి పంటల తెలంగాణ… పంటల సాగులో టాప్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
పసిడి పంటల తెలంగాణ... పంటల సాగులో టాప్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ధాన్యం దిగుబడిలో మనమే
  • పలు రకాల పంటల ఉత్పత్తిలో రికార్డు
  • వరి సాగులో దేశంలో అగ్రస్థానం
  • పత్తి దిగుబడిలో మూడోస్థానం
  • చిరుధాన్యాల్లో ఐదో స్థానం
  • వెల్లడించిన కేంద్ర వ్యవసాయ శాఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం సిరులు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలోనే పంటల సాగు, దిగుబడిలో ముందు దేశంలో నిలిచింది. దీంతో తెలంగాణలో సిరుల పంట పండుతుందని కేంద్రం భావిస్తున్నది. ప్రధానంగా – వరి ధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో నిలబడ్డాం. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో సిరుల పంట పండుతోంది. 2023–-24 సంవత్సరంలో 168.74 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, పెరిగిన నీటిపారుదల సౌకర్యాలతో రాష్ట్రం ధాన్యలక్ష్మికి నిలయంగా మారింది. మరోవైపు ఈ వానాకాలం కూడా పంటల సాగు పెరిగింది. ఈ నెల 25 వరకు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారు. మరో పది రోజుల పాటు వానాకాలం పంటల సాగు కొనసాగుతోంది. ఇందులో అత్యధికంగా 65.49 లక్షల ఎకరాలు, పత్తి 43.76 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

రైతుల రాష్ట్రం

దేశంలో వారి పంట దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది. 2023–-24లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే పత్తి దిగుబడిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ రూపాల్లో కైవసం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పొగాకు దిగుబడిలో 2, మినుము, ఆముదంలో 3, జొన్న, వేరుసెనగ పంటలో 5 స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాల నివేదికను కేంద్రవ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రప్రభుత్వం ఈ అంచనాలను రూపొందించింది. పంటలపై రిమోట్‌ సెన్సింగ్, ప్రతి వారం డిజైన్ క్రాప్‌ వెదర్‌వాచ్‌ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన డేటాను సరిపోల్చుకొని తుది నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రధాన పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో బాగా పెరిగాయి.

దేశంలో 2023 – 24 సంవత్సరంలో ప్రధాన పంటలు 3,322.98 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. 2022–-23 సంవత్సరం నాటి తుది అంచనాలతో ఇది 26.11 లక్షల టన్నులు ఎక్కువగా చూపబడింది. పంటల వారీగా గోధుమ 27.38 లక్షలు, వరి 20.70 లక్షలు, చిరుధాన్యాలు 2.51 లక్షల టన్నుల మేర దిగుబడులు పెరిగాయి. 2023-–24లో మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో కరవులాంటి పరిస్థితులు, రాజస్థాన్‌లో సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల సోయాబీన్, పప్పు దినుసులు, పత్తి వంటి పంటలపై ప్రభావం చూపినట్లు కేంద్రం ఉంది.

టాప్ లో తెలంగాణ

2023-24లో వరి దిగుబడిలో 168.74 లక్షల టన్నులు సాధించి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన వారి దిగుబడుల్లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తర్‌ప్రదేశ్‌ (159.90 లక్షల టన్నులు), పశ్చిమబెంగాల్‌ (156.87), పంజాబ్‌ (143.56), ఛత్తీస్‌గఢ్‌ (97.03) రాష్ట్రాలు నిలిచాయి. ఇక ఏపీలో వరి దిగుబడి 73.42 లక్షల టన్నులుగా తుది అంచనాలు వచ్చాయి. గడిచిన ఐదేళ్లలో ఇదే అతి తక్కువ నమోదు అయినట్లుగా కేంద్రం ఉంది.

వీటితో పాటుగా మన రాష్ట్రంలో పండిన మిగిలిన పంటలలో చిరుధాన్యాలు 199.15 లక్షలు, మొక్కొన్న 27.79 లక్షలు, పొద్దుతిరుగుడు 0.15 టన్నుల దిగుబడులు. అలాగే 50.80 లక్షల బేళ్ల పత్తిని ఉత్పత్తి చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జొన్న 3.29 లక్షలు, ఆముదం 0.25 లక్షలు, మినుము 3.45 లక్షలు, వేరుసెనగ 3.23 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. పొగాకు 2 లక్షల టన్నులుగా దిగుబడి వచ్చింది. కంది పంట దిగుబడులకు సంబంధించి తెలంగాణలో 34.17 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించగా 1.45 లక్షలు, ఏపీలో 0.96 లక్షల టన్నులుగా లభించింది. అలాగే దేశంలో శనగపంట దిగుబడి 110.39 లక్షల టన్నులు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షలు, తెలంగాణలో 1.64 లక్షల టన్నులు దిగుబడి లభించింది.

ఈసారి కూడా..!

ఈ వానాకాలంలో కూడా రికార్డు స్థాయిలో పంటలు సాగు చేస్తున్నారు. నిరుడితో ప్రస్తుత వరిసాగు మరింత పెరిగింది. నిరుడు వానాకాలంలో 64.61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. ఈసారి ఇప్పటికే 65.49 లక్షల ఎకరాలు దాటిపోయింది. ఆహార ధాన్యాల సాగు మొత్తంగా 77 లక్షల ఎకరాలు దాటింది. ఇందులో పప్పు దినుసులు 5.90 లక్షల ఎకరాలుగా ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ 4.27 లక్షల ఎకరాలుగా నమోదైంది. ఇక, పత్తి సాగు 43.76 లక్షల ఎకరాలు ఉండగా.. నిరుడు 44 లక్షల ఎకరాలు దాటింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech