Home సినిమా పవన్‌కళ్యాణ్‌ని పొగిడిన బన్నీ.. ఇక కలిసిపోయినట్టేనా.. అంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్! – Prajapalana News

పవన్‌కళ్యాణ్‌ని పొగిడిన బన్నీ.. ఇక కలిసిపోయినట్టేనా.. అంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్! – Prajapalana News

by Prajapalana
0 comments
పవన్‌కళ్యాణ్‌ని పొగిడిన బన్నీ.. ఇక కలిసిపోయినట్టేనా.. అంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్!


గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఏర్పడిన వివాదం. మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, కొన్నేళ్ళుగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని సందర్భాల్లో పవన్‌కళ్యాణ్‌, బన్నీ కలుసుకోవడం ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడం జరిగింది. ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా దిగారు. దాంతో వీరిద్దరి మధ్య అన్నీ సర్దుకున్నాయి అనుకున్నారందరూ.

ఇలా జరిగిన కొన్నాళకే మళ్ళీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. అయితే ఈసారి ఏర్పడిన వివాదం రాజకీయానికి సంబంధించింది అది మరింత ఉధృతమైంది. ఏపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకి విజయాన్ని అందించాలని అందరూ ప్రయత్నిస్తుంటే మెగా కాంపౌండ్‌కి చెందిన బన్నీ నంద్యాల వెళ్లి అక్కడి అభ్యర్థిని కలవడం మెగా ఫ్యాన్స్‌కి రుచించలేదు. అంతేకాదు, నాగబాబు వంటి వారు ఓపెన్‌గానే బన్నీని ఉదహరించారు. సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌ వంటి వారు ఇన్‌డైరెక్ట్‌గా తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పవన్, బన్నీ మళ్లీ కలుసుకునే అవకాశం లేదు అని నిర్ధారణకు వచ్చారంతా..

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్‌కళ్యాణ్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ చేశారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్‌కళ్యాణ్ ఫోటో చూపించినపుడు బన్నీ ఇలా స్పందించారు. 'సొసైటీలో ఎంతో మంది లీడర్స్‌ని, బిజినెస్ పర్సన్స్‌ని చూశాను. కానీ, కల్యాణ్‌గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం. నాకు తెలిసిన వ్యక్తుల్లో చాలా డేరింగ్ పర్సన్ ఆయన. తన దారిలో తను వెళ్లిపోతారు' అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు.

బన్నీ చేసిన ఈ కామెంట్స్‌తో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగిపోయినట్టేనని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరో పక్క హీరోలంతా ఒక్కటేనని సందర్భం వస్తే ఎంత శత్రుత్వం ఉన్నా కలిసిపోతారని, మధ్యలో ఫ్యాన్స్ మాత్రం వారి కోసం యుద్ధాలు చేస్తారని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వారి కోసం కుమ్ములాడుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ కామెంట్స్‌తో అంతా సర్దుకుపోదని, వారిద్దరి మధ్య ఉన్న అభిప్రాయభేదాలు సమసిపోవని అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్‌ని ఆపాలంటే ఈ పొగడ్తలు సరిపోవు అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతకుమించి ఏదో జరగాలని, దానికి సందర్భం కూడా కలిసి రావాలని అంటున్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech