సామాజిక మాధ్యమాలు వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి తన భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అధిక తీసుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. అక్రమార్కుడిగా తానేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని అత్యుత్సాహంతో ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, తమ అత్తమామలు నిర్మాణం చేసి గోడౌన్ వారికి ఇచ్చారన్నారు. పనులు చేసుకోకపోతే హద్దులు వస్తాయని నిర్మాణం చేశామన్నారు. తాను, తన భార్య కానీ ఏ రోజు వెళ్లి చూసేదేమి లేదని, తమ దగ్గర ఉన్న మేనేజర్ అక్కడ స్టాక్ లో తేడాలు ఉన్నాయని పేర్కొన్న ఈ సందర్భంగా పేర్ని నాని గుర్తు చేశారు. నవంబర్ 26న స్టాక్‌లో లోపం ఉందని తెలిసింది.
అధికారులు ఫిజికల్ గా స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లయిస్ ఎండీ లెటర్ రాశారని, ఈ నెల 10వ తేదీన కింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారని నాని పేర్కొన్నారు. 10వ తేదీన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తన భార్య జేసుదాసులతోపాటు ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చారు. 3708 బస్తాల స్టాక్ వెరియేషన్ కనిపిస్తోందని, 1.70 లక్షలు మూడు రోజుల్లో గా కట్టాలని గొడౌన్ దగ్గర అంటించి వెళ్ళారని వివరించారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయినందున తమ లీగల్ టీం ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఇలా చేసి ఉంటారని గుర్తించారు. తమ కుటుంబ సభ్యులంతా ఆ డబ్బులను జమ చేశామని, కేవలం నైతిక బాధ్యత వహించి డబ్బులు జమ చేశామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తాము ఏ తప్పు చేయలేదని ఒక లెటర్ కూడా ఇచ్చామన్నారు. 11వ తేదీన జిల్లా కోర్టులో తన భార్య జయసుధ బెయిల్ కోసం దరఖాస్తు చేసిందని, బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా పలు ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఏదో ఒకరకంగా తనను, తన భార్యను అరెస్టు చేయాలని రాజకీయ కక్షతో ఉందని, తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెడితే వారిని రక్షించాలని చూస్తారా.? లేక వారిని జైలుకు పంపిస్తారా అని ఈ సందర్భంగా పేరుని ప్రశ్నించారు. తాను తప్పు చేశానని ఆధారాలు ఉంటే అరెస్టు చేయించుకున్నారు. కేవలం అద్దెకు ఆశపడి గోడౌన్ కట్టడమే తప్ప తాము చేసిన తప్పేంటని పేర్ని ప్రశ్నించారు.
తాము ఎప్పుడూ తప్పుడు పనులకు రాజకీయాల్లో చేయలేదని, నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఎవరైనా ఇలా చేస్తారా అని పేర్ని ప్రకటించారు. తానేమైనా తప్పుడు పనులు చేసే వ్యక్తి అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా పనిచేస్తానా.? అని ప్రశ్నించారు. బిజెపిగా పనిచేస్తున్న వ్యక్తి గతంలో ఆర్టీసీ ఎండీగా చేశారని, తాను రవాణా మంత్రిగా పనిచేశామని చెప్పారు. నేను ఎప్పుడైనా తప్పుడు పనులు చేయిస్తాను లేదా అన్న పరీక్ష ఆయన చెప్పాలనుకున్నాను. తన గురించి చెడుగా మాట్లాడుతున్న ఒక మంత్రి తన భార్య మీద కేసు పెట్టడం దగ్గర నుంచి అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని, ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు ఏంటి అని చెప్పి చంద్రబాబు వెళ్ళిపోయారని ఈ సందర్భంగా పేర్ని నాని ఏర్పాటు చేశారు. కావాలంటే నాని, అబ్బాయిని అరెస్టు చేయాలని చంద్రబాబు చెప్పారు. రాజకీయ వైరం ఉంటే తన మీద చూసుకోవాలని, ఇంట్లో ఉంటే తన భార్య ఏం చేసిందని. తనను, తన కొడుకును అరెస్టు చేయడమే కదా మిగిలిందని, అరెస్టు చేసుకోండని స్పష్టం చేశారు. చంద్రబాబు తిట్టిన తర్వాత కూడా బెయిల్ రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు, గోడౌన్ దగ్గర నానా హంగామా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగినవన్నీ లాయర్లు వీడియోలు తీశారని, ప్రతి విషయంలో బయటకు వచ్చి మాట్లాడితే నాని ఎందుకు మాట్లాడలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాను కొద్దిరోజులు ముందే మాట్లాడాలని చూసినా కోర్టులో కేసు నడుస్తున్నందున మా లాయర్లు చెప్పడంతో ఆగిపోయినట్లు పేర్ని నాని చెప్పుకొచ్చారు.
మందుబాబులకు శుభవార్త.. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు అప్పటి వరకు.!
2025లో థియేటర్లలో రాబోయే తెలుగు మూవీస్ ఇవే!