Home తాజా వార్తలు పదకొండు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

పదకొండు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
పదకొండు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • బీజేపీ లేకుండా తెలంగాణలో రాజకీయాలు జరగవు
  • గెలిచే వారికే ఎమ్మెల్సీ టికెట్లు
  • మూసీ ప్రక్షాళన చేయాల్సిందే – నీళ్ళు ఇవ్వాల్సిందే
  • ఇళ్ళు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహించబోం
  • ధాన్యపు చివరి గింజ వరకు కేంద్రమే కొనుగోలు చేస్తుంది

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారం చేపట్టిన పదకొండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ దివాలా తీశాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. తెలంగాణలో పేరుకుపోయిన మహిళ, యువత, రైతాంగ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు ఆయన హాజరయ్యారు. వచ్చే నాలుగేళ్ళ పాటు ప్రజల పక్షాన్న పోరాటం చేయాలన్నారు.

ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ లో బిజెపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కార్యశాల కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ బన్సాల్, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండే విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సహా పలువురు పార్టీ ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకమారు గ్రామస్థాయి నుంచి సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకునే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణలో 31 లక్షల సేకరణ పూర్తయింది. 15వ తేదీ వరకు సేకరణ చేపట్టాలన్నారు. గ్రామస్థాయిల్లో నిర్దేశించిన సమయంలో జిల్లా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. పార్టీలో ఎమ్మెల్సీ టికెట్లు ఆశించేవారు ఉన్నారని, అయితే గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఎక్కువగా ఇస్తామని ఆయన చెప్పారు. పార్టీ గెలవాలనే కోణంలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే – నీళ్ళు ఇవ్వాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం మాసీ ప్రక్షాళన చేయాల్సిందేనని, నీళ్ళు ఇవ్వల్సిందేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి వచ్చిన అభ్యంతరం లేదు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరిక. రిటైనింగ్ వాల్ కట్టాలన్నారు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో బస, ఒకరోజు అక్కడే నిద్ర చేస్తామన్నారు. అక్కడ ఉంటున్న వాళ్ళ ఇళ్లలో ఉండి, అక్కడే తింటామని ఆయన చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బీజేపీ బృందాలు పర్యాటించాయి. కులగణన చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని అన్నారు. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ హాయంలో రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, ప్రస్తుత రేవంత్ సర్కార్ ఏ భూములను తాకట్టు పెట్టి అప్పు చేయాలని యోచిస్తున్నాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు.

బీజేపీ లేకుండా తెలంగాణలో రాజకీయాలు జరగవు

బీజేపీ లేకుండా తెలంగాణలో రాజకీయాలు జరగవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీనీ ఖతం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్ భవన్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని కేటీఆర్ అర్థం లేని ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ పైన తమకు ఎందుకు కుట్ర ఉంది, వారికి అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. బీజేపీ గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు, అంటే బీజేపీ పేరు ఎత్తకుండా వారికి మాట్లాడటానికి ఏ అంశాలు లేవని ఎద్దేవా చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్వి బరితెగింపు మాటలని, తన డీఎన్ఏ మంత్రి పొన్నం అడిగారని, తన డీఎన్ఏ తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి అన్నారు. సర్పంచ్ లో సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించడం విడ్డూరంగా ప్రదర్శన. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వక పోగా, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ఇచ్చిన పైసలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్న కిషన్ రెడ్డి.

చివరి గింజ వరకు కేంద్రమే కొనుగోలు చేస్తోంది

రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యపు చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం ఎన్నివేల కోట్లయినా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇక్కడి ప్రభుత్వం మధ్యవర్తులు, మిల్లర్లు, దళారులతో కుమ్మక్కై రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలో ఎవరూ కూడా భారం పడనీయడం లేదు. ప్రతీ పైసా లెక్కపెట్టి ఇస్తుంది. ఎందుకు నిర్దేశించిన ప్రభుత్వం బాధ్యతాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. సీఎం రేవంత్ మాటలు కోట్లు దాటుతాయే తప్ప పనులు కనిపించవు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech