- స్వాతంత్ర్యపోరాటం, హైదరాబాద్ విలీనంలో బీజేపీ పాత్ర లేదు
- అప్పట్లో ఆ పార్టీ పుట్టనే లేదు
- బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోంది
- గాంధీభవన్ ప్రజాపాలన వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తో బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో గానీ, హైదరాబాద్ విలీనంలో కానీ బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్న ఆయన అప్పటికి బీజేపీ పార్టీనే పుట్టలేదన్న ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్చించిన పీసీసీ చీఫ్.. జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. అందుకే మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన సోనియా గాంధీని, వారి కుటుంబాన్ని కించపరచడం బీఆర్ఎస్ పార్టీ నీతిమాలిన చర్యలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.హైదరాబాద్ ప్రజాపాలనలో విలీనమైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది. స్వాతంత్య్రనంతరం దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలోని అన్ని సంస్థలను విలీనం చేశారు నాటి కేంద్ర హోంమంత్రి, ఆయనకు అత్యంత సన్నిహితులైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కోరినట్లు తెలిపారు. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి ప్రధాని నెహ్రూకు అత్యంత సన్నిహితులని పేర్కొన్నారు.