- అన్నారం ఐకెపి సెంటర్ నుండి కోదాడకు లారీలో ధాన్యాన్ని ఎనిమిది రోజులకు తిప్పి పంపిన మిల్లు యజమానులు
- తీవ్ర మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని గుగులో కీమా దంపతుల ఆత్మహత్యాయత్నం
- సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న తుంగతుర్తి తాసిల్దార్ దయానందం ఎడి బాలకృష్ణ
- విషయం తెలుసుకున్న సూర్యాపేట జైంట్ కలెక్టర్
- తక్షణమే ధాన్యాన్ని అదే లారీ తో నియమించిన మిల్లు యాజమాన్యాన్ని వైద్యం చేసిన జైంట్ కలెక్టర్
- జైంట్ కలెక్టర్‌తో ధాన్యం తీసుకోవడానికి ఒప్పుకున్న కోదాడ వెంకటరమణ మిల్లు యాజమాన్యం
- రైతుల ధాన్యాన్ని అడ్డగోలుగా తరుగు తీస్తున్న మిల్లర్లు ఆరోపిస్తున్న రైతులు
తుంగతుర్తి ముద్ర :- ఆరుగాలం పండించిన దాన్యంప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి రైతులు తీసుకెళ్లగా నాణ్యతను చూసి తూకం వేసి మిల్లుకు పంపిన ధాన్యం నాణ్యత లేదని మిల్లు యజమాని తిప్పి పంపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గిరిజన కుటుంబం అదే ధాన్యం లారీ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం తుంగతుర్తి మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామ ఐకెపి దంపతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుగులో కీమా అదే గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి పొలాన్ని కౌలు చేసుకుంటూ పండించిన సుమారు 425 బస్తాలధాన్యాన్ని పోసారు. కాగా ఐకెపి సెంటర్లో ఈనెల 16వ తేదీన ధాన్యం తూకం వేసి 17వ తేదీన లారీలో లోడ్ చేసి కోదాడ వెంకటరమణ ట్రేడర్స్ మిల్లుకు పంపడం జరిగింది .అట్టి ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం పరిశీలించి 18వ తేదీన నాణ్యత లేదని చెప్పడంతో అన్నారం ఐకెపి నిర్వాహకులు రైతు కీమా దంపతులు మిల్లుకు వెళ్లారు. యాజమాన్యం బస్తాకు మూడు కేజీల తరుగు తీస్తామని చెప్పడంతో తాము ఒక కేజీ తరుగు ఒప్పుకుంటామని మూడు కేజీలు తీయవద్దని రైతు చెప్పారు. అనంతరం ధాన్యాన్ని పరిశీలించి టి ఏ అధికారి ధాన్యాన్ని పరిశీలించి నాలుగు రోజుల అనంతరం అనగా 23వ తేదీన ఐకెపి సెంటర్ అన్నారానికి లారీని తిప్పి పంపడం జరిగింది. విషయం తెలుసుకున్న రైతు గుగులో కీమా దంపతులు తీవ్ర మనస్థాపానికి గురై తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు సకాలంలో అక్కడ ఉన్న రైతులు కీమా దంపతులను రక్షించారు. వెంటనే పరిశీలించి తుంగతుర్తి తాసిల్దార్ దయానందం కు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న తాసిల్దార్ దయానందం వ్యవసాయ శాఖ ఏడి బాలకృష్ణ ఏపీవో రాంబాబు లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు .ఇదే విషయం తాసిల్దార్ ద్వారా తెలుసుకున్న సూర్యాపేట జాయింట్ కలెక్టర్ తక్షణమే అదే లారీ లోడును కోదాడలోని వెంకటరమణ మిల్లు వారినీ నిర్వహిస్తున్నారు. మిల్లు యాజమాన్యం జైంట్ కలెక్టర్ తెలిపిన ప్రకారం ధాన్యం తీసుకోవడానికి అధికారులు అంగీకరించారు .దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కోదాడ వెళ్లే లారీలో ముగ్గురు రైతుల ధాన్యం నిర్వాహకులు తెలిపారు. కాగా అదే మిల్లులో ఈనెల 16వ తేదీన వెళ్లిన మరో లారీ ధాన్యంలో క్వింటాకు రెండున్నర కేజీల తరుగు తీసినట్లు రైతులు చెబుతున్నారు. తరుగు తీయవద్దని ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది అది అమలులో మాత్రం లేదనేది జరుగుతున్న సంఘటనలు చెబుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రైతుల ధాన్యం నష్టపోకుండా చూడాలని యావత్ రైతాంగం కోరుతోంది.