24
ముద్ర,పానుగల్:- నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమీషన్ జిల్లా చైర్మన్ గా పానుగల్ వారికి శాగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక తిరుపతి యాదవ్ నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు గోపి గౌడ్ నుండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నియామక పత్రాన్ని మౌనిక తిరుపతి యాదవ్ స్వీకరించారు.
వినియోగ దారులకు సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో వినియోగదారులకు చట్టపరంగా ఉన్న హక్కుల పట్ల అవగాహన లేక అనేక మంది పోతున్నారని వారి పక్షాన పోరాడి న్యాయం అందేవిధంగా చూడటమే తమ లక్ష్యమని ఆమె అన్నారు.