NRI పేరెంట్స్ అసోసియేషన్ మరియు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, నూతక్కి గంగాధరావు వైద్య శిబిరం వారి ఆధ్వర్యంలో ఈ రోజు నేలకొండపల్లిలో బసవతారకం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు కోసం.
ఈ క్యాంపులో ప్రజలకు క్యాన్సర్ పై బసవతారకం ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించారు మరియు వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయినటువంటి వారికి హైదరాబాద్‌లోని బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి వైద్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందజేస్తారు.
వైద్యశిబిరంలో నేలకొండపల్లి చుట్టుపక్కల వివిధ గ్రామాలనుండి వచ్చిన 157 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్కరికి సుమారు 10,000/- రూపాయల విలువైన సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, బ్రెస్ట్ స్క్క్రీనింగ్ కు సంబంధించిన మామో గ్రాఫ్, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి అనేక రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. శిబిరన్నకు వచ్చిన సాధారణ రోగులకు కూడా వారి జబ్బులను బట్టి వైద్యులు సూచించిన మందులను ఉచితంగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ, తూబాటి శివ శంకర్, చావా వినయ్, బసవతారకం వైద్య సిబ్బంది డాక్టర్ శ్రావణకుమారి, డాక్టర్ సులోచనారాణి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ శాంతిని , క్యాంపు కోఆర్డినేటర్ పాపినేని ఆదిత్య ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వెనిగళ్ల శ్రీనివాస్, ట్రెజర సామినేని పెద్దావిడ. కార్యవర్గ సభ్యులు ఝాన్సీ, ప్రమీల, ఆళ్ల నాగేశ్వరావు, రాయల రవి, ఆఫ్జల్, వీరబాబు డీఎన్‌ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యన బాబు, స్థానిక క్యాంపు నిర్వాహకులు రాయల వెంకటేశ్వర్లు, కె వెంకట రెడ్డి, ఏటుకూరి రామారావు, ఉమామహేశ్వరి, గొడవర్తి నాగేశ్వరావు ఉన్నారు.