- ముఖ్య అనుచరుడి హత్యపై ఆగ్రహం
- బీఆర్ఎస్ నేతలకు వత్తాసులు పలుకుతున్నారంటూ విమర్శలు
- టీపీసీసీ చీఫ్‌తో ఫోన్‌లో రాజీనామా చేస్తానన్న జీవన్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌లో మళ్లీ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇదే సమయంలో టీపీసీ చీఫ్ మహేష్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి తాజా పరిణామాలపై కుండబద్దలు కొట్టారు. తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ మహేష్ కాల్ కట్ చేశారు.
తన ముఖ్య అనుచరుడు జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారుారెడ్డి (58) దారుణహత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆయనను పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ.. గత 40ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన తనకు మంచి బహుమతి లభించిందని మహేష్ తో అన్నారు. ఇంత జరిగినా తాను ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ చెప్పి మహేష్ కుమార్ మాట్లాడుతుండగా కాల్ కట్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన జీవన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్రంలో మొదలైంది.
కాంగ్రెస్ రాజ్యంలో బీఆర్ఎస్ పెత్తనం
తెలంగాణలో రాజ్యమేలుతున్న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతల పెత్తనం కొనసాగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగిత్యాలలో పోలీసులు బీఆర్ఎస్ నేతల కనుసందుల్లో పని చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా ఇటీవల జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన డాక్టర్ జయయ్ కుమార్ ను తనకు తెలియకుండానే కాంగ్రెస్ లో చేర్చుకున్న జీవన్ రెడ్డి అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఆనాడే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించగా.. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో తన రాజీనామా ఆలోచన నుంచి వెనుతిరిగారు. కాగా ఆరోజు నుంచి అధిష్టానానికి దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి.. తాజాగా తన ముఖ్య అనుచరుడు హత్యకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సారి రు రాజీనామా చేయించారు మరో.