Home ఆంధ్రప్రదేశ్ నేడు విశాఖలో ప్రధాని భారీ బహిరంగ సభ.. రెండు లక్షల కోట్ల భారీ ప్రాజెక్టులకు శ్రీకారం – Prajapalana News

నేడు విశాఖలో ప్రధాని భారీ బహిరంగ సభ.. రెండు లక్షల కోట్ల భారీ ప్రాజెక్టులకు శ్రీకారం – Prajapalana News

by Prajapalana
0 comments
నేడు విశాఖలో ప్రధాని భారీ బహిరంగ సభ.. రెండు లక్షల కోట్ల భారీ ప్రాజెక్టులకు శ్రీకారం


ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. దాదాపు రెండు లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖ నగర పరిధిలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే ఆయన ఈ కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. అంతకుముందు ఆయన రోడ్ షో నిర్వహించి ఈ వేదికకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. గడిచిన పది రోజులుగా ఈ సభను విజయవంతం చేయడంపై కూటమి నాయకులు దృష్టిసారించారు. సుమారు మూడు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని మూడు పార్టీల నాయకులు చెబుతున్నారు. ఈ సభా వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక లో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శ్రీకారం చుట్టనున్నారు. దీని విలువ రూ.1.85 లక్షల కోట్లు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేలకోట్లుగా చెప్తున్నారు. వీటితోపాటు ప్రధాని 10కిపైగా మరో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరుగురు, రైల్వే లైన్లను జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన కూటమి తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. దీనితో సభను గ్రాండ్ సక్సెస్ కోసం కూటమి పార్టీలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి.

శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు ఇవే

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ సభా వేదికగా 12 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకుపైగా జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రెండు లక్షల కోట్లు. సభా వేదికపై కూటమి నాయకులు అందరూ కనిపించనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఉంది. అలాగే, కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ రోడ్డు, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం శంకుస్థాపన, ఆదోని పట్టణం నుంచి ఎన్ హెచ్-167ను కలుపుతూ బైపాస్ రహదారి, కొండమోరు నుంచి పేరేచర్ల రహదారి విస్తరణ, సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వరకు రహదారి విస్తరణ, వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు ఎన్‌హెచ్-440 విస్తరణ, ఎన్హెచ్ 516 నుంచి పాడేరు బైపాస్ రహదారి నిర్మాణం, గుంటూరు నుంచి బీబీనగర్ వరకు రైల్వే లైన్ డబ్బింగ్ మహబూబ్ నగర్ నుంచి కర్నూలు మీదుగా డోన్ రైల్వే లైన్ డబ్లింగ్, గుత్తి – పెండేకల్లు రైల్వే డబ్లింగ్, రూ.19,500 కోట్ల విలువైన విలువైన రైల్వే ప్రాజెక్టులు, ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు భాగ్య రేఖ అయిన క్రిస్టి సిటీ (కృష్ణపట్నం – ఇండస్ట్రియల్ సిటీ) ను ఏర్పాటు చేయనున్నారు.

కెనడాలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనిత ఆనంద్
జనవరిలో లభించే తాజా పండ్లు, కూరగాయలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech