- హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గత రెండ్రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం కూడా వాతావరణ శాఖ ఉంది. శనివారం నాడు సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షానికి రహదార్లపై నీరు పారింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయబ్రాంతులకు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కురిసిన వర్షంతో డ్రైనేజీలు నిండి పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.
ఇదిలావుండగా శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. ఈ కావలసిన పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు విడిచిపెట్టే సమయం కావడంతో విద్యార్ధులు, ప్రయాణికులు, వాహనదారులు వర్షానికి తడిచి ముద్దయ్యారు. హైటెక్ సిటి నుండి సికింద్రాబాద్, పంజాగుట్ట నుండి ఎల్బీ నగర్, సికింద్రాబాద్ నుండి ఎల్బీ నగర్ రూట్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ లో వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోయింది. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌సీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపుకు చర్యలు చేపట్టారు. భారీ వర్షం కురుస్త ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.