24
ముద్ర, తెలంగాణ బ్యూరో : శాసనసభ కమిటీ హాల్‌లో నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ నెల 30న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు, కొత్తగా ఇవ్వాల్సిన రేషన్ కార్డులు, మూసీ నది ప్యూరీఫికేషన్, సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, పాతబస్తీకి మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ, రైతు భరోసా, మహాలక్ష్మీ పథకం రూ. 25.00 సాయం వంటి మంత్రివర్గం చర్చించనున్నది. ఆయా పథకాలు, అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం కోరాలని కోరుకునే రాష్ట్ర సర్కార్ ఈ విషయంపై సమాలోచనలు చేయనుంది.