37
ప్రభుత్వ అధికారిక కార్యక్రమల్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో నియెజకవర్గంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. కొడంగల్‌లో ఫిజియో థెరపీ, వైద్య, నర్సింగ్ కళాశాలల పనులను కూడా ప్రారంభించనున్నారు.
అనంతరం హెలికాప్టర్‌లో కోస్గి చేరకుని పోలీస్ స్టేషన్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల స్టాళ్లను సందర్శించి, వారితో కాసేపు ముచ్చటించనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం కొంగర కలాన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తారు. అనంతరం ఫాక్స్‌కాన్ కంపెనీ పనులను పరిశీలించి.. ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.