30
తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల నిరవధిక సమ్మె ఇవాళ్టి నుంచి జరుగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ఆరోగ్యశ్రీ మిత్రల సిబ్బంది ముట్టడించనున్నారు. ఇప్పటికే సర్కారుకు నోటీసు ఇచ్చిన ఆరోగ్యశ్రీ స్నేహితులు.. నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు కూడా ప్రకటన చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని చెప్పారు.