29
- సెప్టెంబర్ 6 నుంచి 26వ తేదీలోగా చెల్లించాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకెండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి 26వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 100 పెనాల్టీతో డిసెంబర్ 4వ తేదీ వరకు, రూ. 500 పెనాల్టీతో డిసెంబర్ 12వ తేదీ వరకు ఫీజు కట్టే అవకాశం కల్పించారు. రూ. 1000 పెనాల్టీతో డిసెంబర్ 18 వరకు, రూ. 2000 పెనాల్టీతో డిసెంబర్ 27 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఫస్టియర్, సెకెండియర్ జనరల్ విద్యార్థులకు రూ.520 , ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు. సెకెండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులు రూ.520, సెకెండియర్ జనరల్ సెన్స్ విద్యార్థులు రూ.750 రుసం చెల్లించాలని సూచించారు.