- డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మల్ లో ఆందోళన
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులైన వారిపై సుప్రీం కోర్ట్ జడ్జి చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు డిమాండ్ చేశారు. నిర్మల్ లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన జరిగింది.
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ కనిపించింది.ఒకే పరీక్ష 8 మందికి టాప్ ర్యాంకులు ఎలా వస్తుందని ప్రశ్నించారు. విద్యార్థుల జీవిత కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రత్న కల్యాణి వినతి పత్రం ఏర్పాటు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, టీపీసీసీ సభ్యులు సాద సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్నూ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.