25
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల కలుషిత ఆహారాన్ని విక్రయించి ఒకరి మరణానికి కారణమైన గ్రిల్9 హోటల్ ను గురువారం సీజ్ చేశారు. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష ఈ హోటల్ కి హోటల్ వెళ్లి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలకు హాని చేస్తూ చెలగాటమాడుతున్న హోటళ్లపై, ఇతర సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.