- రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగించాం
- అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం
- హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 17న గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం రూట్ ఇన్ స్పెక్షన్ నిర్వహించామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా జరిగేలా ముందుకు సాగుతున్నామని అన్నారు. గణేష్ నిమజ్జన యాత్ర సందర్భంగా నగర వ్యాప్తంగా అన్ని రూట్లలో అడ్డంగా ఉన్న చెట్లను, వైర్లను తొలగించామన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.
నగరంలో భాగంగా నగరానికి చెందిన 15 మంది పోలీసులు, ఇతర జిల్లాల నుంచి పది వేల మంది పోలీసులు కలిపి మొత్తం 25 మందితో బందోబస్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే నిమజ్జనాల రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా క్రేయిన్స్ , వెహికిల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇదిలావుండగా, ఈనెల 17న పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుందని, అలాగే బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో విమోజన వేడుకలు జరగనున్నాయని, సౌత్ జోన్ ఎంఐఈఓం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరగనుందని తెలిపారు. ఈ మూడు కార్యక్రమాలు, నిమజ్జనాల కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అన్ని కార్యక్రమాలను ప్రశాంతంగా ముగుస్తుందని తాము ఆశిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.